Home బాపట్ల సమాజసేవలో భాగస్వామ్యం కావాలి

సమాజసేవలో భాగస్వామ్యం కావాలి

7
0

చీరాల (DN5 News) : సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని, సమాజసేవలో అందరూ భాగస్వామ్యం కావాలని ప్రేమ హాస్పిటల్ ఎండి డాక్టర్ ఐ బాబురావు అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కారసాల శశ్వంత్ వీర్ అవిఘ్న పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని కోటయ్య అనాధ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ బాబురావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ వంటి సంస్థలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వృద్ధులు, అనాధ పిల్లల పట్ల ప్రేమాభిమానాలు చూపుతూ ఇలాంటి సేవాలు మరింత విస్తృతం చేయాలని అన్నారు. వృద్ధాశ్రమంలో నివసిస్తున్న 120 మంది వృద్ధులు, పిల్లలకు రూ.12వేల విలువవైన సబ్బులు, పేస్ట్‌లు, టూత్ బ్రష్‌లు, కొబ్బరినూనె డబ్బాలు, షాంపూ ప్యాకెట్లు, పామాయిల్ డబ్బాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు జాలాది కృష్ణమూర్తి, కార్యదర్శి తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, పుల్లయ్య నాయుడు, వంగర పూర్ణచంద్రరావు, గుద్దంటి రమేష్ బాబు, శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.