Home ప్రకాశం దాతల సాయంతో ఏసీఏ యూత్ ఆధ్వర్యంలో ప్రతి రోజు సేవా కార్యక్రమాలు : ఆకురాతి రేవంత్

దాతల సాయంతో ఏసీఏ యూత్ ఆధ్వర్యంలో ప్రతి రోజు సేవా కార్యక్రమాలు : ఆకురాతి రేవంత్

302
0

చీరాల : “కరోనా” మహమ్మారి వల్ల పేదవారికి పనులు లేక తినటానికి కూడా ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. “పెరీరా” స్కూల్ 1994-95 బ్యాచ్ విద్యార్థులైన అందె శ్రీనివాసరావు (హైదరాబాద్), బట్ట అనిల్ (దేశాయిపేట) సహాయంతో చీరాల రూరల్ సిఐ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పేద ప్రజలకు బోయినవారిపాలెం, చీరాల యానాదికాలనీకి చెందిన 170మందికి పండ్లు (ద్రాక్ష, మామిడి, అరటి కాయలు) పంపిణీ చేశారు. పేదవారి ఆకలి తీర్చాలి అనుకునే వారు దయచేసి ఇలాంటి వారికి మన వంతు సాయం చేయాలని ఏసీఏ యూత్ ప్రతినిధి ఆకురాతి రేవంత్ కోరారు. ప్రతిరోజు పేదవారికి సాయం చేస్తున్న దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.