బెంగళూరు: సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత నెలకంది. బుధవారం అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో జయంతి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమెకు బెంగళూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళ రంగాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ జయంతి నటించారు. తెలుగులో ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖ హీరోల సరసన జయంతి నటించారు. ‘పెద్దరాయుడు’ సినిమాలో మోహన్‌బాబు మేనత్తగా జయంతి కీలక భూమిక పోషించారు. పలు పురస్కారాలను ఆమె అందుకున్నారు.