Home ప్రకాశం విద్యార్థులు వత్తిడితో కాకుండా ప్రణాళికతో చదవాలి : డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్

విద్యార్థులు వత్తిడితో కాకుండా ప్రణాళికతో చదవాలి : డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్

798
0

– విద్యార్థులకు రోటరీ ఎప్పుడు అండగా ఉంటుంది : తాడివలస దేవరాజు
– విద్యార్థులు మనసిక వత్తిడికి గురికకుడదు.
– విద్యార్థులకు10 త్ క్లాస్ పరీక్షలు ఎంతో కీలకం.
– విద్య, వైద్యం అందరికీ అందించడమే రోటరీ క్లబ్ లక్ష్యం.
– పాజిటివ్ థింకింగ్ ని అలవరుచుకోవాలి.
– తగినంత నిద్ర సరైన పోషకాహారం తీసుకోవాలి

చీరాల : 10వ తరగతి విద్యార్థులకు రోటరి క్లబ్ ఆఫ్ క్షిరపురి ఆధ్వర్యంలో వత్తిడి నియంత్రణ, పరీక్షలకు ఎలా సిద్దం అవ్వాలి, లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన సదస్సును శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మానసిక వైద్యనిపుణులు డాక్టర్‌ అద్దేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేరాల ఎంఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. సెమినార్‌లో వైద్యులు అద్దెపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పగలు, రాత్రి లాగే జీవితంలో సుఖాలు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, కాబట్టి ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. విద్యార్థులు మసిక వత్తిడికి గురికకుడదన్నారు. విద్యార్ధులకు 10వతరగతి పరీక్షలు కీలకమన్నారు. సానుకూల దృక్పధం అలవర్చుకోవాలన్నారు. పరీక్షలు అనేవి జీవితంలో భాగమే కానీ పరీక్షలే జీవితం కాదని చెప్పారు. మార్కుల కంటే జీవితం చాలా ముఖ్యమైనదని వివరించారు. మీరు సాధించే మార్కులతో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే అమ్మానాన్నలకు చాలా సంతోషం కలుగుతుంది. కాని ఆ మార్కుల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే అదేతల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురవుతారో ఆలోచించాలన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని చెప్పారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ లో తాను ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటానని, విద్యార్థులకు ఉచిత సలహాలు, కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.

కామాక్షి కేర్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాడివలస దేవరాజు, హెడ్ మాస్టర్ సోలమన్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు ఎంతో ఉపయోగ కరంగా సెమినార్‌ ఉందని, విద్యార్థులకు చక్కటి సందేశం ఇచ్చిన డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాంధీ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.