– రోటరీ విద్యార్థులకు ఎప్పుడు అండగా ఉంటుందన్న తాడివలస దేవరాజు – విద్యార్థులు మానసిక వత్తిడికి గురికాకుడదు. – విద్యార్థులకు10వ తరగతి పరీక్షలు ఎంతో కీలకం. – విద్య, వైద్యం అందరికీ అందించడమే రోటరీ క్లబ్ లక్ష్యం. – విద్యార్థుల స్ట్రెస్ తో కాకుండా ప్రణాళికతో చదవాలి. – తగినంత నిద్ర, సరైన పోషకాహారం తీసుకోవాలి చీరాల : 10వ తరగతి విద్యార్థులకు రోటరి క్లబ్ ఆఫ్ క్షిరపురి ఆధ్వర్యంలో స్ట్రెస్ మనాజ్మేట్, పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, గోల్ సెట్టింగ్ అనే అంశాలపై అవగాహన సదస్సును శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మానసిక వైద్యనిపుణులు అద్దేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నీలం జమేస్ స్కూల్ నందు నిర్వహించారు.
కార్యక్రమంలో వైద్యులు అద్దెపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పగలు, రాత్రి లాగే జీవితంలో సుఖాలు కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి కాబట్టి ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు
విద్యార్థులు మసిక వత్తిడికి గురికాకుడదని చెప్పారు. విద్యార్థులకు10తరగతి పరీక్షలు ఎంతో కీలకం అన్నారు. సానుకూల దృక్పథం అలవరుచుకోవాలని సూచించారు. పరీక్షలు అనేవి జీవితంలో భాగమే కానీ పరీక్షలే జీవితం కాదని పేర్కొన్నారు. మార్కులు కంటే జీవితం చాలా ముఖ్యమైనదని చెప్పారు. మీరు సాధించే మార్కులతో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే అమ్మానాన్నలకు చాలా సంతోషం కలుగుతుంది కాని ఆ మార్కుల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని విద్యార్థులకు సూచించారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ లో ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటానని విద్యార్థులకు ఉచిత సలహాలు, కౌన్సిలింగ్ అందిస్తాం అని తెలియజేశారు.
దేవ రాజు, రావి రమణరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగ కరంగా ఉందని, విద్యార్థులకు చక్కటి సందేశం ఇచ్చిన డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, పి ఆర్ ఓ నరేంద్ర పాల్గొన్నారు.