చీరాల : వరకట్న వ్యతిరేక దినోత్సవం, న్యాయ దినోత్సవం సందర్భంగా కోర్టు హాలులో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. చట్టాలపై అవగాహన కల్పించారు. సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి కృష్ణన్ కుట్టి మాట్లాడుతూ చట్టాలను తప్పుదోవలో పాటించకుండా తగిన రీతిలో ఉపయోగించాలన్నారు. చట్టాలపై అవగాహన తోనే నేరాలను అదుపు చేయవచ్చు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, న్యాయవాద సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ ఠాకూర్, న్యాయవాదులు పాల్గొన్నారు.