Home ప్రకాశం అందరికీ ఆరోగ్యం – ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లక్ష్యం : తాడివలస దేవరాజు

అందరికీ ఆరోగ్యం – ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లక్ష్యం : తాడివలస దేవరాజు

498
0

చీరాల : అందరికి ఆరోగ్యాన్ని అందించటమే ఆయుషుమాన్ భారత్ లక్షమని శ్రీకామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ తాడివలస దేవరాజు పేర్కోన్నారు. డాక్టర్ వైస్సార్ ఆరోగ్య శ్రీ, ఆయుషుమాన్ భారత్ మొదటి వారోత్సవం, పక్షోత్సవాల సందర్భంగా ఆదివారం వైద్యశాలలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలందరికి ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నూతన విధానం అమలైతే వెయ్యి రూపాయలకు పైబడిన అన్ని చికిత్సలు ఉచితంగా అందించటం జరుగుతుందన్నారు. దీని వలన పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ అందరికి ఆరోగ్యం అనే నినాదంతో ఆయుషుమాన్ భారత్ ప్రకటించారని తెలిపారు.
23న సోమవారం ఉచితవైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈశిబిరంలో క్యాన్సర్ పై అవగాహనతో పాటు ఊబకాయం తగ్గించుకొనే విదానాలపై అవగాహన పాలిస్తారని చెప్పారు. ఉచితంగా మధుమేహ పరీక్షలు, బీపీ పరీక్షలు చేస్తామన్నారు. రోగులు ఈశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ చలువాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎముకలు విరిగిన వారికి, ఎముకుల సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా ఓపీ, ఉచితంగా డిజిటల్ ఎక్స్ రే తీస్తామన్నారు. ఉభ ఖాయం వలన వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బరువుని అదుపులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ తాడివలస సురేష్ పాల్గొన్నారు.