Home ప్రకాశం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా చీరాలలో కిడ్నీలో రాళ్లకు ఉచితంగా ఆపరేషన్

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా చీరాలలో కిడ్నీలో రాళ్లకు ఉచితంగా ఆపరేషన్

405
0

– వైయస్సార్ ఆరోగ్యశ్రీని అందరూ వినియోగించుకోండి
– అందరికి ఆరోగ్యమే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లక్ష్యం
– పేదలకి వైద్యసేవలు అందించడంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ముందుంటుందన్న ఎండి తాడివలస దేవరాజు

చీరాల : గురువారం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణంలో కిడ్నీ జబ్బులపై అవగాహన సదస్సు ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ పువ్వాడ రవిచంద్ర చే నిర్వహించారు. డాక్టర్ రవి చంద్ర మాట్లాడుతూ కిడ్నీ జబ్బులుపై అవగాహన లేకపోవడం, ప్రాథమిక దశలో కిడ్నీ జబ్బుల్ని గుర్తించకపోవడం, తగినంత నీటిని తాగకపోవడం, షుగర్ ఉన్న వారు సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షించుకోకపోవడం, కిడ్నీ జబ్బులకు ప్రధాన కారణాలని తెలిపారు.

ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్ళనవసరం లేకుండా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచితంగా ఆపరేషన్ లు చేయనున్నట్లు పేర్కోన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు కడుపుకు సంబంధించిన ఆపరేషన్లు, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు, చెవి ముక్కు గొంతు ఆపరేషన్ లు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తామన్నారు. త్వరలో నూతన విధానం అమలైతే వెయ్యి రూపాయలకు పైబడిన అన్ని చికిత్సలు ఉచితంగా అందించటం జరుగుతుందన్నారు. దీని వలన పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. సదస్సులో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ పలుకురి సురేష్, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ చలువాది వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ తాడివలస సురేష్ పాల్గొన్నారు.