Home బాపట్ల శ్రీగౌతమిలో విద్యార్ధినులకు ఆత్మరక్షణ విద్య శిక్షణ

శ్రీగౌతమిలో విద్యార్ధినులకు ఆత్మరక్షణ విద్య శిక్షణ

11
0

చీరాల (DN5 News) : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ బి ఉమామహేశ్వర్‌ (Umameheswar IPS) ఉత్తర్వుల ప్రకారం డిఎస్పి మోయిన్‌ ఆదేశాలతో చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు, ఎస్ఐ రాజ్యలక్ష్మి, ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్, హెచ్‌సి రామారావు తమ సిబ్బందితో కలిసి పట్టణంలోని శ్రీ గౌతమీ డిగ్రీ కాలేజీ విద్యార్థునులకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చారు. అందులో వారికి మెలకువలు నేర్పించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు, చిన్న పిల్లలఫై జరుగుతున్న నేరాలు, మోసాలు ఎలా అధిగమించాలో వివరించారు. శక్తి టీం సభ్యులు పిసి సుబ్బారావు శక్తి యాప్ గురించి, పోలీసు ఎమర్జెన్సీ నెంబర్ల గురించి, మాదకద్రవ్యాల గురించి వివరించారు.