Home ప్రకాశం కరోనాపై ఆందోళన వద్దు… మానసిక ధైర్యం అవసరం : తాడివలస దేవరాజు

కరోనాపై ఆందోళన వద్దు… మానసిక ధైర్యం అవసరం : తాడివలస దేవరాజు

367
0

– కరోనా బాధితులు ఆత్మ హత్యలకు పాల్పడటం బాధాకరం
– ఆత్మహత్యలు సమస్యలు పరిష్కారం కావు
– ఆత్మహత్య చేసుకునే ముందు మీ కుటుంబాన్ని ఒక్క క్షణం గుర్తుచేసుకోండి
– ఆత్మహత్యల నివారణ దినోత్సవ సభలో దేవరాజు
చీరాల : కరోనా బాధితులు ఆత్మ హత్యలకు పాల్పడటం బాధాకరంమని, కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోతుందని శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ, చీరాల జిల్లా సాధన సమితి చైర్మన్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. కరోనా ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకొంటే సులభంగా జయించవచ్చునని చెప్పారు. పరీక్షలు, ఉద్యోగం, ప్రేమించిన వాళ్ళు ఏదో ఒక రూపంలో మళ్ళీ వస్తాయి కానీ ప్రాణం మాత్రం మళ్లీ తిరిగి రాదన్నారు.

అంతర్జాతీయ ఆత్మ హత్యల నివారణ దినోత్సవాన్ని
పురష్కరించుకొని గురువారం జరిగిన కార్యక్రమంలో దేవరాజు మాట్లాడారు. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూచించారు. చిన్న పాటి జాగ్రత్తలు తీసుకొంటే సులభంగా కరోనానిని జయించ వచ్చునని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో కరోనా ఆందోళనతో ఆత్మ హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనాను జయించిన 80ఏళ్ల వృద్దురాలితో రిమ్స్ వైద్యులు డా. రిచర్డ్స్, డా. మురళీకృష్ణరెడ్డి

తమ కుటుంబం మొత్తానికి కరోనా వచ్చిన సమయంలో తాము తీవ్ర ఆందోళన చెందినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అందరం కరోనాని జయించామన్నారు. అందులో 80ఏళ్ల వృద్రాలినించి 3, 5సంవత్సరాల చిన్న పిల్లలు కూడా జయించిన వారిలో ఉన్నారన్నారు. కరోనాను ఎదుర్కవడానికి కావాల్సినది ఆత్మ విశ్వాసమే నన్నారు. కరోనా వచ్చిందని కుంగి పోకుండా దైర్యంగా పోరాడాలని సూచించారు.

కరోనాపై పోరాటంలో రాష్టా ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ప్రకాశం కలెక్టర్ పోలా భాస్కర్, డీఎంహెచ్వో డాక్టర్ పద్మావతి, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు పర్యవేక్షణలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జాన్ రిచర్డ్స్, డాక్టర్ మురళికృష్ణరెడ్డి, డాక్టర్ వేణుగోపాలరెడ్డి, నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల వైద్య సేవలతో 80సంవత్సరాలు ఉన్న తమ అమ్మమ్మ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నదని చెప్పారు. రిమ్స్ లో వైద్య సేవలు అభినందనీయమని తెలిపారు.

కరోనా నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆహారంలో కోడిగుడ్డు, డ్రై ఫ్రూట్స్, పాలు, పండ్లు, పౌష్టికాహారంతో కూడిన ఉన్నటువంటి తాజా కూరగాయలను ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.