టంగుటూరు: కనుమ పండుగ సందర్భంగా టంగుటూరు ఊర చెరువులో సీతారాముల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెప్పలో సీతారాముల విగ్రహాలను ఉంచి, పోలేరమ్మ గుడి వద్ద నుండి చెరువు చుట్టూ వేద మంత్రాలతో తెప్పోత్సవం నిర్వహించారు. చెరువు చుట్టూ విద్యుత్తు దీపాల అలంకరణతో ఎంతో అందంగా అలంకరించారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, ఎంపీపీచదలవాడ చంద్రశేఖర్, టిడిపి మండల అధ్యక్షులు కామని విజయ్ కుమార్, గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి తెప్పోత్సవాన్ని తిలకించారు. మూడురోజులుగా సంక్రాంతి సంబరాలు కమిటీ నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, ఎంపీటీసీలు భారతి, పద్మ, టీడీపీ నాయకులు కామని విజయకుమార్, పత్తిపాటి వెంకటసుబ్బారావు, పత్తిపాటి చిన్న, చిడిపోతు వెంకటేశ్వర్లు, డాక్టర్ బెల్లం సునీల్, నాయుడు చేతులమీదుగా బహుమతులు ప్రధానోత్సవం చేశారు. అనంతరం నెల్లూరు సప్తస్వరాలు బృంధంచే జరిగిన పాట కచేరిలో ప్రముఖ సినీ యాంకర్ స్వాతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.