Home ప్రకాశం కదిలిన అధికారులు – ఫలించిన వినతులు

కదిలిన అధికారులు – ఫలించిన వినతులు

575
0

– ట్రాక్టర్ & జెసిబిలు పొందిన ఎస్‌సి, ఎస్‌టి లబ్దిదారుల సబ్సిడీకి కమీషనర్ గ్రీన్ సీగ్నల్
– వాహనాల వేరిఫికేషన్ ప్రక్రియను ప్రారంబించాలని అన్ని జిల్లాల జిఎంలకు అదేశాలు


అమరావతి : దళిత పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధుల వినతులు ఫలించాయి. ఎపి ఎస్‌సి, ఎస్‌టి ట్రాన్స్‌పోర్టు ఎర్త్‌మూవర్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ వి భక్తవత్సం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డిని కలిసిన అనంతరం అధికారుల్లో కదలిక వచ్చింది. అధికారులు మంత్రి ఆదేశాలతో స్పందించారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి లబ్దిదారుల ట్రాక్టర్లు, జెసిబిలకు సంబంధించిన సబ్సిడీలను మంజూరు చేసేందుకు ఆ శాఖ కమిషనర్‌ సుబ్రమణ్యం అనుమతించారు. అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యాలయంలో కమిషనర్‌ సుబ్రమణ్యంను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా ఎస్‌సి, ఎస్‌టిలు వాహనాలు గోనుగోలు చేసి కరువు పరిస్థితుల్లో బాడుగులు లేక బ్యాంకులకు కిస్తీలు కట్టలేక పోతున్నారని వివరించారు. పనులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని ఈనెల 30న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికీ వివరించినట్లు కన్వీనర్‌ వి భక్తవత్సలం కమిషనర్ సుబ్రమణ్యంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్‌ను కలిసినవారిలో భక్తవత్సలం వెంట అసోసియేషన్‌ సభ్యులు గురిజాల బాబురావు, బాలనరసయ్య, విజయ్ ఉన్నారు.