నెల్లూరు : సబ్సిడీపై ట్రాక్టర్లు పొందిన ఎస్సీ, ఎస్టి లబ్ధిదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసి దళిత పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి గౌతమ్ రెడ్డి వెంటనే పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యంతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు పొందిన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సబ్సిడీ చెల్లించే విషయంపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో డిక్కీ ప్రతినిధులు వి భక్తవత్సలం, ఇతర ప్రతినిధులు ఉన్నారు.