చీరాల : మహిళా చైతన్యానికి సావిత్రీబాయి జీవితం స్పూర్తి కావాలని హైమా హాస్పిటల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్, కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. మహిళల్లో అక్షరాస్యత పెరిగితే సమాజంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉన్నతమైన సమాజ నిర్మాణానికి అదే గీటురాయి అవుతుందన్నారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో జాండ్రపేట అయోధ్యనగర్‌లో జరిగిన సావిత్రీభాయిపూలే జయంతి సభలో వారు మాట్లాడారు. బాల్య వివాహాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తొలిగా తాను అక్షరాలు నేర్చుకుని మహిళల్లో అక్షరాస్యత ఉధ్యమాన్ని నడిపిన చైతన్య స్పూర్తి సావిత్రీబాయి పూలే అన్నారు. సభకు చేనేత జనసమాఖ్య నాయకులు కర్న హనుమంతరావు అధ్యక్షత వహించారు. సభలో దేవన వీర నాగేశ్వరరావు, సరళ కుమారి, శ్రీకృష్ణ, జాయరామిరెడ్డి మాట్లాడారు.
కార్యక్రమంలో బిఎస్‌పి నాయకులు వైజీ సురేష్, బాబురావు, వెంకటేశ్వర్లు, సిర్రా భగత్‌సింగ్, దాసరి సరళకుమారి, బిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, చేనేత జనసమాఖ్య అధ్యక్షులు దేవన వీరనాగేశ్వరరావు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు బక్క జయరామి రెడ్డి, మాజీ ఎంపిపి దామర్ల కృష్ణ, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు పాల్గొన్న వారు.