వేటపాలెం (DN5 News): సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ (StANNs Eng’College, Vetapalem) కళాశాల రజతోత్సవ వేడుకలు, జాతీయ టెక్నికల్ సింపోజియం సాసెట్ రజితోత్సవ్ ఘనంగా జరిగింది. కళాశాల సెక్రటరి వనమా రామక్రిష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు పర్యవేక్షణలో జరిగిన ఉత్సవాల్లో శాసన సభ్యలు ఎంఎం కొండయ్య, నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్యం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ప్రసన్న కుమార్, మాజీ మంత్రి, కళాశాల ఫౌండర్ ఛైర్మన్ వనమా వెంకటేశ్వరరావు విచ్చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు.

శాసనసభ్యలు ఎంఎం కొండయ్య (Chirala MLA MM Kondaiah) విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్ధులకు ఆధునిక సదుపాయాలు కల్పించి, మంచి అధ్యాపక బృందంచే విద్యాబోధన అందిస్తున్న కళాశాల ఈ ప్రాంతంలో ఉండటం హర్షించ దగ్గ విషయమని అన్నారు. అత్యుత్తమ ఉత్తీర్ణతతో, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించటంపై యాజమాన్యం దృష్టి సారించడం, వారి ఉన్నతికై మేలైన బాట వేసి, ఒక ప్రత్యేకమైన శైలిలో కళాశాలను అభివృధ్ది పధంలో నడిపినందుకు ఫౌండర్ ఛైర్మన్ వనమా వెంకటేశ్వరరావు, కమిటి సభ్యులను అభినందించారు. విద్యార్ధులు చదువుకునే చదువులో పోటీతత్వాన్ని ప్రదర్శించాలని అన్నారు. విద్యార్ధులు 4సంవత్సరాలు కష్టపడి చదివినట్లైతే జీవితం మొత్తం సుఖపడవచ్చని తెలిపారు. విద్యార్ధులు విజయం వైపు ప్రయాణం చేసి ప్రయోజకులు అవ్వాలని ఆకాంక్షిచారు. అందుబాటులో ఉన్న అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సెయింట్ ఆన్స్ కళాశాలకు కేటాయించడం తమ ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశమన్నారు.
గెస్ట్ ఆఫ్ హానర్ ఎం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యార్ధులు మల్టి డైమన్‌షన్ టాలెంట్‌పై దృష్టి సారించాలని తెలిపారు. భవిష్యత్తుపై ఆశావాద దృక్పధంతో అడుగులు వెయ్యాలని తెలిపారు. విద్యార్ధులు తాము నేర్చుకునే రోజులలో ఉన్నతమైన ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్ధి దేశ ఆభివృధ్దిలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. పవర్ జనరేషన్ రంగంలో భారతదేశం స్వయం సంవృద్దిని సాధించాలని అన్నారు. కార్బన్ న్యూటల్ వైపు భారతదేశం అడుగులు వేయాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి విద్యార్ధి తమవంతు కృషిచేయాలని తెలిపారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు. ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య, ఎం ప్రసన్న కుమార్‌కు కళాశాల యాజమాన్యం దుశ్యలువాతో సన్మానం చేశారు.

విద్యార్ధులకు ప్రాజెక్ట్ ఎక్స్‌పో, టెక్నికల్ క్విజ్, సాసెట్ ప్రీమియర్ లీగ్, ఆన్‌లైన్ గేమింగ్, జెమిని అండ్ ఐ పోటీలు శుక్రవారం నిర్వహించారు. అందులో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను అందజేశారు. శుక్రవారం రాత్రి ప్రముఖ సినీ గాయకులచే గీత ఆలాపన, విద్యార్ధులచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మెన్ వనమా రాఘవేంద్రరావు, వైస్ ఛైర్మెన్ బి ఫణి రాజు, కళాశాల డైరెక్టర్లు, యాజమాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విధ్యార్దులు పాల్గొన్నారు.






