వేటపాలెం (DN5 News) : సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలు, జాతీయ టెక్నికల్ సింపోజియం సాసెట్ (SACET)రజితోత్సవ్ 2026 ఘాంగంగా ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామక్రిష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. గెస్ట్ ఆఫ్ హానర్, మాజీ మంత్రి, కళాశాల ఫౌండర్ ఛైర్మన్ వనమా వెంకటేశ్వరరావు కళాశాల రజతోత్సవ పైలాన్ ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ విచ్చేసి కళాశాల సెల్ఫి పాయింట్ ప్రారంభించారు.

అనంతరం కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ (Vinod Kumar IAS) విద్యార్ధులను ఉద్ధేశించి మాట్లాడారు. కళాశాల యాజమాన్యం 25 సంవత్సరాల పాటు ఇంజినీరింగ్ విద్యార్ధులకు అందించిన సేవలు కొనియాడారు. విద్యార్ధులతో తన అనుభవాలు పంచుకున్నారు. విద్యార్దులు తమకు ఇష్టమైన రంగంలో కృషి చేసి ఉన్నత స్ధాయిలో స్ధిర పడాలని ఆకాంక్షించారు. మంచి స్ధాయిలో స్ధిరపడి తమ కుటుంబాన్ని ఉన్నత స్ధాయికి తీసుకుని వెళ్లాలని సూచించారు. సమాజానికి, తమ వర్గ అబివృద్దికి సైనికుని వలె కృషి చేయాలని కోరారు. తద్వారా దేశాభివృద్ధికి తోత్పడాలని తెలిపారు. అనంతరం రజితోత్సవ సావనీర్ ఆవిష్కరించారు.

కళాశాల పూర్వ విద్యార్ధుల సంఘం తరపున ఉన్నత స్ధాయిని సాధించిన వివిధ విద్యార్ధులను కలెక్టర్ సత్కరించారు. కళాశాల ఫౌండర్ చైర్మన్ వనమా వెంకటేశ్వరరావును, మేనెజ్‌మెంట్ సభ్యులను, ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లడుతూ సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల 2001లో బిటెక్ 3 బ్రాంచీలు 180 సీట్లతో ప్రారంభమై నేడు డిప్లమో నుండి పిహెచ్‌డి వరకు 6వేల మంది విద్యార్థులకు విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. 2009 నుండి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్రిడిటేషన్ గుర్తింపు, 2011 నుండి నాక్ గుర్తింపు, కాకినాడ జెఎన్‌టియు శాశ్విత గుర్తింపు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే ‘ఎ’ గ్రేడ్ కళాశాలగా గుర్తింపు పొంది జిల్లా స్ధాయిలో ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల గుర్తింపు పొందినదని తెలిపారు. ఈ రోజు జరిగే వివిధ పోటీలకు సుమారు వెయ్యి మంది విద్యార్ధులు వివిధ కళాశాలల నుండి పోటీ పడుతున్నారని తెలిపారు.
కళాశాల రజతోత్సవ వేడుకల సందర్బమగా కళాశాలలోని వివిధ విభాగాలలో జరిగే వివిధ పోటీలు, విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ యాజమాన్యం ప్రారంభించారు. విద్యార్ధులు కళాశాల గార్డెన్‌లో ప్రదర్శించిన సామూహిక డాన్సు (రాంపేజ్) వీక్షకుల్లో ఉత్సాహం నింపిందన్నారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మెన్ వనమా రాఘవేంద్రరావు, వైస్ ఛైర్మెన్ బి ఫణిరాజు, కళాశాల డైరెక్టర్లు, యాజమాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విధ్యార్దులు పాల్గొన్నారు.






