Home బాపట్ల సరోజిని నాయుడు జయంతి సందర్బంగా మహిళా కార్మికులకు సత్కారం

సరోజిని నాయుడు జయంతి సందర్బంగా మహిళా కార్మికులకు సత్కారం

16
0

చీరాల (chirala) : స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్, ఈవినింగ్ వాకర్స్ స్మార్ట్ క్లబ్ ఆద్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడుగురు పురపాలక మహిళా పారిశుధ్య కార్మికురాలను ఘనంగా సత్కరించి, నూతన వస్త్రములు బహుకరించారు.

ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ సరోజినీ నాయుడు (sarojini naidu) కవయిత్రి, భారత స్వాతంత్య్ర సమర యోధురాలు, రాజకీయ నాయకురాలు, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైల్ కి వెళ్లి వచ్చి, అనేక ఇంగ్లీష్ కవితలు రచించి భారత కోకిల అని మహాత్మ గాంధీ (mahatma gandhi) చే పిలిపించుకొన్నారని గుర్తు చేశారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ (congress) మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరించారని అన్నారు. 1947లో స్వతంత్ర భారత దేశంలో ఉత్తర ప్రదేశ్ మహిళా గవర్నర్ గా వుండి, మహిళల ఓటు హక్కు కోసం, విద్య కోసం, వితంతుల పునర్వివాహం కొరకు పోరాడిన మహోన్నత వ్యక్తని అన్నారు.

ఆమె 147వ జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చారగుళ్ళ గురుప్రసాద్, సుధాకరరావు, సుభాషిణి, భానుకుమారి, లాల్, పూర్ణా, నారాయణ, మధు, మురళీకృష్ణ, రవి, రాముడు, తుకారాం, రమణారావు తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.