చీరాల : చీరాల ఇంజనీరింగ్ కళాశాల (సిఇసి)లో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం సప్తవర్ణ 2018కార్యక్రమాన్ని అట్టహాసంగా శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ తేళ్ల అశోక్‌కుమార్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం విద్యార్ధులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ఇలాంటి సాంకేతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్ధుల్లో దాగిఉన్న సాంకేతిక, మృదుసంబాషణ, వృత్తినైపుణ్యం, క్రీడలు, నృత్య, గాన. అభినయ, పేపర్ ప్రజెంటేషన్, నూతన ఆవిష్కరణలు, సరిక్రొత్త టెక్నాలజీ వినియోగం, ప్రజలు, వినియోగదారులకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో ఉపయోగించే పరిజ్ఞానం తెలియజేటం వంటి అంశాలను సప్తవర్ణ కార్యక్రమంలో విద్యార్ధులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, కంప్యూటర్ లాంగ్వేజెస్, మార్కెటింగ్, హెచ్ఆర్, క్రీడలు, నృత్యం, గానం వంటి రంగాలలో పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్ఒడిలు పాల్గొన్నారు.