Home ప్రకాశం ఆరోగ్య వంతమైన సమాజమే రోటరీ లక్ష్యం : దేవరాజు

ఆరోగ్య వంతమైన సమాజమే రోటరీ లక్ష్యం : దేవరాజు

463
0

చీరాల : ఆరోగ్య వంతమైన సమాజమే రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి లక్ష్యమని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్వీ రమణ, తాడివలస దేవరాజు, ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ అన్నారు. రోటరి క్లబ్ క్షిరపురి ఆధ్వర్యంలో శనివారం రామకృష్ణాపురం ఎస్ఎం ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్ లు, హ్యాండ్ వాషింగ్ సంబంధించిన సబ్బులు, వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యత నివ్వాలని తెలిపారు. మల, మూత్ర విసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

ప్రముఖ న్యాయవాది హేమంత్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణకు విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో మొక్కలను ఇష్టారాజ్యంగా నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిందన్నారు. దీని పర్యవసానమే ఎండలు విపరీతంగా పెరగటానికి కారణమన్నారు.

పాండురంగారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి సమాజాభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యాభివృద్ధికి సాయం అందించటంతోపాటు అపన్నులకు అండగా ఉంటామన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు.

ప్రధానోపాధ్యాయుడు నాగమల్లేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందజేయటం అభినందనీయమని అన్నారు. దాతలు ఇచ్చిన సామగ్రిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో పాండురంగారావు, బ్రహ్మం, ఎమ్మెస్ ఎయిడెడ్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.