చీరాల : వాడరేవు సముద్ర తీరంలోని ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా బుధవారం పౌర్ణమి సందర్భంగా సామూహిక సాగర హారతి హిందూ చైతన్య వేదిక నాయకులు డాక్టర్ తాడివలస దేవరాజు, బండారు జ్వాలా నరసింహం, అర్చక స్వాములు, వేద పండితులు కార్తీక్ శర్మ, కారంచేటి నగేష్ కుమార్, నర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్పటిక శివలింగానికి పంచ అమృతాలతో అభిషేకం, మంత్ర పుష్పం, సామూహిక సాగర హారతి నిర్వహించారు. సంగ్ రాష్ట్ర నాయకులు ఆవ్వరు శ్రీనివాసరావు, అంజనేయ శర్మ హాజరై పంచామృత అభిషేకం చేసి, సాగర హారతిలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నాయకులు నాగేశ్వరరావు, తడవర్తి చంద్రశేఖర్, గుమ్మ బాలాజీ, సుబ్రమణ్యం, పిక్కి నారాయణ, గురవయ్య, రామకృష్ణ, ఓడరేవు టిడిపి నాయకులు, ఓడరేవు గ్రామ పెద్దలు, విట వెంకటేశ్, కోటి గోపి యాదవ్, రఘు, అంబటి మారుతి రామ్, వేద శ్రీ, శ్రీనివాస్ వుల్లగంటి, డాక్టర్ శబరి గుప్త, లక్ష్మీ శ్రీనివాస్, భవాని, శ్రీ మహాలక్ష్మి మహిళా భజన బృందం సభ్యులు, ఓడరేవు ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.