అమరావతి : రాష్ట్రంలో 22 లక్షల మంది ఎదురు చూస్తున్న సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేసారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధకారులు ఉన్నారు.
మొత్తం 1,34,524 పోస్ట్ లకు ఈ నెల 1 నుంచి 8వరకు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఫలితాలు కూడా శరవేగంగా విడుదల చేసింది. ఈ పరీక్షకు 19లక్షల74వేల మంది హాజరయ్యారు. కేవలం 10రోజుల్లోనే పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 19రకాల పోస్టులకు వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్ 1న శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్ 2నుంచి వీరు విధుల్లో చేరాల్సి ఉంది. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
https://apgvsmresults19782782.apcfss.in/apVswsResult20193647125896.apgs
పరీక్షలో టాపర్స్ వీరే…