Home సినిమా సినిమా ఫట్.. కలెక్షన్లు ఫుల్.. సాహోకు సాహో అంటున్న ప్రేక్షకులు

సినిమా ఫట్.. కలెక్షన్లు ఫుల్.. సాహోకు సాహో అంటున్న ప్రేక్షకులు

494
0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్‌డమ్ `సాహో`కు బాగా కలిసొచ్చింది. తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా `సాహో` కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. విడుదలైన తొలి 6 రోజుల్లో ఈ సినిమా ఏకంగా 350 కోట్ల రూపాయలను దాటేసి కొత్త రికార్డును నమోదు చేసింది.

`బాహుబలి`తో ప్రభాస్‌కు వచ్చిన గుర్తింపు కారణంగా విడుదలైన అన్ని భాషల్లోనూ `సాహో`కు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. తొలిరోజునే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. 5 రోజుల్లోనే ఆ సంఖ్య 350 కోట్లకు చేరింది. 6 రోజుల్లో (బుధవారం) హిందీ వెర్షన్‌లో 109 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి `సాహో` విడుదలైన 6 ఐదు రోజుల్లోనే 350 కోట్ల మార్కును దాటి ప్రభాస్ స్టామినాను తెలియజెప్పింది.