Home ప్రకాశం గ్రామీణ వైద్యులు నిత్య విద్యార్ధులుగా నైపుణ్యం పెంచుకోవాలి

గ్రామీణ వైద్యులు నిత్య విద్యార్ధులుగా నైపుణ్యం పెంచుకోవాలి

694
0

చీరాల : గ‌్రామీణ ప్రాధ‌మిక వైద్యులు నిత్య‌విద్యార్ధిలా వైద్యం రంగంలో వ‌చ్చే కొత్త అంశాల‌ను నేర్చుకుంటూ గ్రామీణ ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించాల‌ని గ్రామీణ వైద్యుల సంఘం గౌర‌వాధ్య‌క్షులు డాక్ట‌ర్ ఐ బాబురావు, గౌర‌వ స‌ల‌హదారులు తాడివ‌ల‌స దేవ‌రాజు పేర్కొన్నారు. ప్ర‌కాశం జిల్లా చీరాల చర్చి రోడ్డులోని సెయింట్ మార్క్ లూథరన్‌ జూనియర కాలేజీ నందు చీరాల పరిసర ప్రాంత ప్రాథమిక వైద్యుల సేవా సంఘం సర్వసభ్య సమావేశం మాట్లాడారు. నూతన కమిటీ ఎన్నిక, రెండు నెలలకు ఒకసారి సేవా కార్యక్రమములు నిర్వహించుట, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరుపుట, ప్రతి ఆరు నెలలకు సారీ జనరల్ బాడీ మీటింగ్ జరుపుట, రాష్ట్ర ఫెడరేషన్‌తో కలిసి పని చేయుట వంటి అంశాలపై చర్చించారు.

కార్యక్రమంలో గౌరవ సలహాదారు రాజేశ్వర్ రావు ప్ర‌ధమ చికిత్స చేసిన అనంత‌రం ద‌గ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు రిఫ‌ర్ చేయాల‌ని చెప్పారు. గ్రామీణ వైద్యులు ఐక్యంగా ఉండి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. పేద‌ల‌కు వైద్య‌రంగంలో స‌హాయ‌ప‌డాల‌ని చెప్పారు. నూతన కమిటీ ప్రెసిడెంట్ ఎస్ సుగుణరావు, వైస్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు, సెక్రటరీ పి శేఖర, జాయింట్ సెక్రటరీగా సుబ్బారావు, ట్రెజరర్ ఆర్ వీరస్వామి, కార్య‌వ‌ర్గ సభ్యులు జెడి ఆంజనేయులు, కె వెంకటేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, బి డేవిడ్, డి మురళి, ఆర్ రాము, జి వెంకటేశ్వర్లు, ఎం శ్రీనివాసరావు, జి వాసు, ఎం వీరలంకరెడ్డి, మహమ్మద్ సహంషా, డి శ్రీను పాల్గొన్నారు.