రాచర్ల : జెపి చెరువుకు చెందిన ఆర్‌టిసి కండక్టర్గా పనిచేస్తున్న నంది ప్రకాశం ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు గ్రామంలో శనివారం ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. సభకు వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఐవవి రెడ్డి హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగం చేస్తూనే ప్రకాశం ప్రజలతో ఉన్న అనుబంధం, సేవలను అభినందించారు. కార్యక్రమంలో రాచర్ల వైసిపి మండల కన్వీనర్ పఠాన్ జఫ్రూళ్ల ఖాన్, దప్పిలి కాసిరెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.