Home ప్రకాశం కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి రూ.5లక్షల విరాళం : రావూరి అయ్యవారయ్య

కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి రూ.5లక్షల విరాళం : రావూరి అయ్యవారయ్య

263
0

ఒంగోలు : కష్టాల్లో వున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకునేందుకు టంగుటూరు మండలం జమ్ములపాలెంకు చెందిన వైస్సార్ సీపీ నాయకులు, టంగుటూరు సహకార సంఘ అధ్యక్షులు, మారుతీ టుబాకో సప్లైర్స్ ప్రోప్రయటర్ రావూరి అయ్యవారయ్య ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు కాపాడాలని లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా గత పదిహేను రోజుల నుండి ప్రజలు ఇంటికే పరిమితమై పనుల్లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. కరోనా బాధితులను ఆదుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందించిన రావూరి అయ్యవారయ్య కరోనా బాధితుల సహాయార్థం రూ.5లక్షల విలువైన చెక్ ను ముఖ్యమంత్రి సహాయనిధికి జమచేసేందుకు రాష్ట్ర మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసులురెడ్డికి కొండపి వైస్సార్సీపీ ఇంఛార్జి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, టంగుటూరు వైస్సార్సీపీ అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిరావులతో కలిసి అందజేశారు. ఐతే ఆ చెక్కును జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశిల్ కి అందజేయాలని మంత్రి సూచించడంతో అనంతరం ఆ చెక్కును ఎస్పీకి అందజేశారు.