Home Uncategorized వాకింగ్‌ రాష్ట్ర అసోసియేషన్‌కు రూ.2.70లక్షల విరాళం

వాకింగ్‌ రాష్ట్ర అసోసియేషన్‌కు రూ.2.70లక్షల విరాళం

111
0

చీరాల : స్థానిక ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ కమ్యూనిటీ హాలు నందు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 మాజీ గవర్నర్ పలగాటి శ్రీనివాసులురెడ్డి సారధ్యంలో డిశంబర్ నెలలో 27మంది వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్టుకు రూ.2.70లక్షలు కట్టిన సందర్భంగా సభ్యులకు మహాత్మా గాంధీ ఫెలోషిప్ (ఎంజిఎఫ్‌) మెమేంటోలు అందజేసి, సన్మానం చేశారు. శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ప్రతి రోజు పళ్ళు ఏవిధంగా తోముకుంటామో, ప్రతి రోజు స్నానం ఏవిధంగా చేస్తామో, అదే విధంగా వాకింగ్ కూడా చేయాలని అన్నారు. రోజు వాకింగ్ చేస్తే అనేక రకాల రోగాలు దూరమవుతాయని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వం హాస్పిటల్స్‌కు అందజేసే నిధులు కూడా ఆదా అవుతాయని అన్నారు. గవర్నర్ పెద్ది శివరామ ప్రసాద్, డిస్ట్రిక్ట్ మాజీ ట్రెజరర్ బి రామ్మోహనరెడ్డి పాల్గొని వాకింగ్ అండ్‌ లాఫింగ్ చేసి ఆరోగ్యంను కాపాడుకోవాలని చెప్పారు. వాకింగ్‌, వ్యాయామంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, గ్రంధి నారాయణమూర్తి, వలివేటి మురళీ కృష్ణ, గుద్దంటి రమేష్ బాబు, వీరాంజనేయులు, శీరాం రమేష్, బదరీనాథ్, తిరుపతిరావు, సుభాషిణి సన్మాన గ్రహీతలు, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.