ఒంగోలు : ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశ పెట్టిన వైయస్సార్ మత్యకార భరోసా పధకం ద్వారా వేట నిషేధ భృతి రూ.12,78,90,000 విలువైన చెక్కును కలెక్టర్ పోలా భాస్కర్, చీరాల శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణామూర్తి, జిల్లా మంత్రి ఆదిమలపు సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత విడుదల చేశారు. జిల్లాలోని మత్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.