Home ప్రకాశం పదోన్నతుల్లో రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం

పదోన్నతుల్లో రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం

296
0

చీరాల : ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో రిజర్వేషన్స్ ప్రాథమిక హక్కు కాదు అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏపీఎన్జీవో భవన్లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కెవిపిఎస్ చీరాల డివిజన్ అధ్యక్షులు లింగం జయరాజు అధ్యక్షత వహించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను నాయకులు ఖండించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను మానుకోవాలని కోరారు. ప్రైవేటు సంస్థల్లో ను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు సామాజికంగా వెనుకబడిన పేద ప్రజల పొట్ట కొట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదన్నారు. సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు గోసాల ఆశీర్వాదం, బెజ్జం విజయ్ కుమార్, కుంచాల పుల్లయ్య, ఎస్.కె అబ్దుల్ రహీం, బాబురావు, ఎం వెంకట్రావు, ఎం రత్న కుమార్, సింహాద్రి ఎలమందారెడ్డి, హరిహరరావు, మెరుగ రవిచంద్ర, ప్రభాకర్ రావు పాల్గొన్నారు.