చీరాల : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత ఆదివారం ఉచిత నేత్ర వైద్యశిభిరం నిర్వహించారు. వైద్యశిభిరంలో 713మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 249మందికి కాటరాక్టర్ శస్ర్తచికిత్సలు అవసరమని గుర్తించారు. వీరిలో తొలివిడతగా గుంటూరు పెదకాకాని శంకర్ నేత్రాలయంలో 117మందికి శస్ర్తచికిత్సలు చేసేందుకు సోమవారం బస్సులు ఏర్పాటు చేసి తరలించారు. రెండో విడత శస్ర్తచికిత్సలకు ఈనెల 15న ఏర్పాటు చేస్తున్నట్లు రోటరీ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు పోలుదాసు రామకృష్ణ, పోలిశెట్టి ప్రేమకుమార్, డివి సురేష్, కొత్తమాసు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.