Home ప్రకాశం ఉన్న‌త ల‌క్ష్యాన్ని ఏర్ప‌ర్చుకోవాలి…

ఉన్న‌త ల‌క్ష్యాన్ని ఏర్ప‌ర్చుకోవాలి…

378
0

చీరాల : విద్యార్ధుల ఉన్న‌త ల‌క్ష్యాల‌ను ఏర్ప‌ర్చుకుని, ల‌క్ష్య‌సాధ‌న‌కు ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే ఉన్న‌త‌మైన భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని కొత్త‌పేట జెడ్‌పి ఉన్న‌త పాఠ‌శాల సొసైటీ కార్య‌ద‌ర్శి, ఎంపిటిసి పివి తుల‌సీరామ్ అన్నారు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో రోట‌రీ సంస్థ‌కు అనుబంధంగా పాఠ‌శాల స్థాయిలో ఇంట‌రాక్ట్ క్ల‌బ్‌ను సోమ‌వారం ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా చీరాల ఇంజ‌నీరింగ్ క‌ళాశాల సంయుక్త కార్య‌ద‌ర్శి తేళ్ల అశోక్‌కుమార్ మాట్లాడుతూ రోట‌రీ క‌మ్యునిటీ క్రాప్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. విద్యార్ధులు సంఘ సేవ‌కు సిద్దంగా ఉండాల‌ని కోరారు. న్యూ జ‌న‌రేష‌న్స్ డైరెక్ట‌ర్ ఫ‌ణిద‌పు శివ‌రాజు, ప్ర‌సాద్ మాట్లాడుతూ సేవ‌చేసే అవ‌కాశం అరుదుగా వ‌స్తుంద‌నా్న‌రు. వ‌చ్చిన ప్ర‌తి అంశాన్ని విద్యార్ధులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. పాఠ‌శాల ఇంట‌రాక్ట్ క్ల‌బ్ అధ్య‌క్షునిగా ఆమంచి వెంక‌టేశ్వ‌ర్లు, కీర్త‌లు ఎన్నికైన‌ట్లు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. కార్య‌క్ర‌మంలో రోట‌రీ అధ్య‌క్షులు వ‌లివేటి ముర‌ళీకృష్ణ‌, క్ల‌బ్ ఆర్గ‌నైజ‌ర్ ప‌వ‌ని భానుచంద్ర‌మూర్తి, ఉపాధ్యాయులు ఎస్‌జిడి ఖురేషి పాల్గొన్నారు.