చీరాల : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో చీరాల ఒకటో పట్టణ సిఐ ఎస్ సుబ్బారావు చే చల్లటి మంచినీటి చలివేంద్రం గురువారం ప్రారంభించారు. రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఎన్ సింగయ్య, సీఐ సుబ్బారావు మాట్లాడుతూ వేసవిలో పాదచారులు, ప్రయాణీకుల దాహం తీర్చుటకు రోటరీ క్లబ్ ముందుకు రావడం అభినందించదగ్గ విషయం అన్నారు. మరెన్నో సేవాకార్యక్రమాలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టేషన్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 40 రోజులు మంచి నీటి చలివేంద్రంను నిర్వహించుట వలన ఉన్నత అధికారులు కూడా ప్రశంసిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో చందలూరి బాల వెంకటేశ్వరరావు, నక్కల సురేష్ బాబు, పోలుదాసు రామకృష్ణ, వంగర పూర్ణచంద్రరావు, మామిడాల శ్రీనివాసరావు, దోగుపర్తి వెంకట సురేష్, చీరాల కృష్ణమూర్తి, జివై ప్రసాద్, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.