Home బాపట్ల రోటరీ ఆధ్వర్యంలో చెస్‌పోటీలు

రోటరీ ఆధ్వర్యంలో చెస్‌పోటీలు

139
0

చీరాల : విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ వారోత్సవాల సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. రోటరీ, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా యువజన వారోత్సవాలు నవంబర్ 3వరకు నిర్వహిస్తున్నారు. 2వ రోజు విద్యార్థులకు దేశభక్తి గీతాలు, స్ఫూర్తి గీతాల పాటల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి 63మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రూపాదేవి, గురువర్థిని వ్యవహరించారు. కార్యక్రమంలో చందలూరి బాల వెంకటేశ్వరరావు, వలివేటి మురళీకృష్ణ, పోలుదాసు రామకృష్ణ, డాక్టర్‌ ఐ బాబూరావు, టి లక్ష్మీప్రతాప్, జివై ప్రసాద్, ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ భాను కుమారి,సెక్రటరీ తల్లం రమా, ఇన్నర్ వీల్ క్లబ్ డిస్త్రిక్ట్ ఎడిటర్ సుభాషిణి పాల్గొన్నారు.