Home ఆంధ్రప్రదేశ్ అమేజ్‌ ప్లాస్టిక్‌ అండ్‌ హెయిర్‌ ప్లాంటేషన్‌ సెంటర్‌లో రోబోటిక్‌ విధానం ప్రారంభం

అమేజ్‌ ప్లాస్టిక్‌ అండ్‌ హెయిర్‌ ప్లాంటేషన్‌ సెంటర్‌లో రోబోటిక్‌ విధానం ప్రారంభం

372
0

– బట్టతలకు రోబోటిక్‌ విధానంలో శాశ్విత పరిష్కారం
– రోబోటిక్‌ హెయిర్‌ ప్లాంటేషన్‌తో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు
– సహజ సిద్దమైన జుట్టును మరిపించేలా ప్లాంటేషన్‌
– సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుతో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్
– 70శాతం బట్టతల ఉన్నవారికీ ఈ విధానంలో పూర్తిస్థాయిలో హెయిర్‌ ప్లాంటేషన్‌
– హోం మంత్రి మేకతోటి సుచరిత చేతులమీదుగా ప్రారంభం
గుంటూరు : ఆధునిక రోబోటిక్ సాంకేతిక వైద్య విధానం గుంటూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని అమేజ్‌ ప్లాస్టిక్‌ అండ్‌ హెయిర్‌ ప్లాంటేషన్‌ సెంటర్‌లో ఆధునిక రోబోటిక్‌ హెయిర్‌ ప్లాంటేషన్‌ సదపాయం ప్రారంభ సభలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్‌ సర్జరీ, హుయిర్‌ ప్లాంటేషన్‌, కస్మొటిక్‌ విభాగాల్లో అనుభవం ఉన్న డాక్టర్‌ సుమితాశంకర్‌ మరింత ముందుచూపుతో ఇలాంటి ఆధునిక వైద్యపరికరాలను అందుబాటులోకి తీసుకరావడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

డాక్టర్‌ సుమితాశంకర్‌ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక రోబోటిక్‌ హెయిర్‌ ప్లాంటేషన్‌ ద్వారా 70శాతం బట్టతల వచ్చినవారికి కూడా తిరిగి వెంట్రుకలు తెప్పించవచ్చని చెప్పారు. ఈ రోబోటిక్‌ ద్వారా చేసిన హెయిర్‌ ప్లాంటేషన్‌ సహజ సిద్దంగా ఉన్న తలకట్టులాగే ఉంటుందని చెప్పారు. ఒకసారి ప్లాంటేషన్‌ చేసిన తర్వాత ఊడిపోవడం వంటిది ఉండవన్నారు. ఎక్కువ కాలం జుట్టు సహజ సిద్దమైన జుట్టు తరహాలోనే ఉంటుందని చెప్పారు. హెయిర్‌ ప్లాంటేషన్‌ చేయించుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయనే భయం ఉండాల్సిన పనిలేదని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు. హెయిర్‌ ప్లాంటేషన్‌ చేసుకుంటే తలనొప్పి వస్తుందని, ప్లాంటేషన్‌ చేసుకున్నా ఊడిపోతాయనే అపోహలు ఉన్నాయని, అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పనిలేదని చెప్పారు. గుంటూరులో మొట్టమొదటిసారిగా బ్రెస్ట్ ఎన్లార్జ్, కాస్మోటక్స్, మైక్రో సర్జరీస్ చేసినటువంటి ఘనత ఆమేజ్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ కి ఉందన్నారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ మేడసాని వెంకటేష్ హైదరాబాద్ తో కలిసి రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సేవలను జాయింట్ వెంచర్ గా గుంటూరులో ప్రారంభిస్తున్నామని తెలిపారు. గుంటూరు నందు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇంటర్నేషనల్ పేషెంట్స్ కు కూడా చికిత్స అందించినటువంటి ఘనత ఆమేజ్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ కి వుందని తెలిపారు.

హెయిర్‌ ప్లాంటేషన్‌ స్పెషలిస్ట్ డాక్టర్ మేడసాని వెంకటేష్ మాట్లాడుతూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేలా ఆధునిక రోబోటిక్‌ విధానం తీసుకొచ్చినట్లు వివరించారు. హెయిర్‌ ప్లాంటేషన్‌ చేసిన తర్వాత సహజ సిద్దంగా వచ్చిన జుట్టుతరహాలోనే ఉంటుందని చెప్పారు. జుట్టు రాలటం జరగదని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ సభలో మద్య విమోచన ప్రచార కమటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని, గుంటూరు ఎస్పీ రామకృష్ణ, జిజిహెచ్ సూపర్డెంట్ బాబులల్ పాల్గొన్నారు.