టంగుటూరు : సురారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన నలావత్తు గణేశ్ నాయక్ (26) మృతి చెందాడు. నెల్లూరులో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా కొత్తగా ఉద్యోగం రావడంతో విధులలో చేరేందుకు తన స్వగ్రామం నుండి నెల్లూరుకు మోటార్ బైక్ పై బయలుదేరి వెళుతున్నాడు. తన మోటార్ సైకిల్ అతి వేగంగా వెళుతూ అదుపుతప్పి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పై డివైడర్ ను ఢీ కొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి టంగుటూరు పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.