చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ మార్క్ లూధన్ జూనియర్ కాలేజీలో ప్రాథమిక వైద్యుల సేవా సంఘం ఆధ్వర్యంలో చీరాల పరిసర ప్రాంత ఆర్ఎంపి, పిఎంపి, గ్రామీణ వైద్య మిత్రుల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజ సిద్ధార్థ, అచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ప్రజలకు అనారోగ్య పరిస్థితుల్లో వెన్నుముక లాంటి వారిని పేర్కొన్నారు.
రాత్రి , పగలు, ఎండా, వాన తేడా లేకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలందిస్తున్నారని చెప్పారు. గ్రామీణ వైద్యులకు వచ్చే ఇబ్బందులో తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. రూ.250చెల్లించి సంఘం సభ్యత్వం పొందాలని సూచించారు. సభ్యత్వం వలన ఎవ్వరికైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం సమావేశ నిర్వహణకు కారణమైన చీరాల శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజును అభినందించారు. తాడివలస దేవరాజు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ఐక్యంగా వుండాలని చెప్పారు. నిత్యవిద్యార్ధిగా ఆధునిక వైద్యంపై పట్టు సాధించాలని చెప్పారు. సాధ్యమైనంత మేరకు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు సాంబశివ రావు, శేఖర్, నాగేశ్వరరావు, ఉపేంద్రరెడ్డి, వీరాస్వామి, సుగున్ రావు, ప్రవీణ్, పాల్గున్నారు.