చీరాల (DN5 News) : స్థానిక ఎన్‌ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ (Walkers associacition) ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు మురహరిశెట్టి శివ అచ్యుతరావు ఆర్ధిక సహాకారంతో కోటయ్య వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, శ్రీకృష్ణ గోశాల గోవుల పోషణకు రూ.1,500 నగదు, వాకింగ్ సభ్యులకు చేతి సంచులు, డ్రై ఫ్రూట్స్ అందజేశారు. కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ల గురుప్రసాద్, తుకారామ్, సుబ్బారావు, రామారావు, నారాయణ, శ్రీనివాసరావు, ఎంఎస్, బాబాజీరావు, అప్పారావు, రమణారావు, చెంగలరాయుడు, వెంకట్ పాల్గొన్నారు.






