చీరాల : చాట్రాసి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ చాట్రాసి రాజేష్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ట్రస్ట్ నిర్వాహకులు చాట్రాసి బాల వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని విజయలక్ష్మిపురంలో అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కొండూరి కామేశ్వరరావు కుటుంబానికి ట్రస్టు తరపున చేయూత అందించారు. మృతుడు కామేశ్వరరావు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన దశదిన కర్మకు అవసరమైన వంద కేజీల బియ్యం బస్తాలు ట్రస్టు ద్వారా అందించారు. పేదలకు తమ వంతు సాయం అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ సేవలు అందిస్తుందని అన్నారు.