– ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని కలిగి ఉండాలన్న సిఐ నాగమల్లేశ్వరరావు
– మాస్కులు వేసుకోకుండా రోడ్డుపైకి రాకూడదు.
– అత్యవసరమైతే మాత్రమే బైక్ పై ఒకరు మాత్రమే రావలెను
– చీరాల పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలి.
– వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ ని మెయింటినెన్స్ చేయాలి.
– ప్రతి ఒక్కరూ ఇంట్లో వుంటే కరోనాను నిర్మూలించగలం
– శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సేవలు అభినందనీయం.
చీరాల : వన్ టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు చేతుల మీదగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు సహకారంతో సెయింట్ మార్క్స్ చర్చ్ ఆవరణలో చీరాల పాస్టర్స్ కి బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒకటవ పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ కరోనా మానవాళికి తీరని కష్టాలను తెచ్చి పెట్టిందన్నారు. అయిన అందరం ధైర్యంతో దీనిపై పోరాడి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. ప్రజలు మాస్కులు వేసుకోకుండా రోడ్డుపైకి రాకూడదన్నారు. అత్యవసరమైతే మాత్రమే బైక్ మీద ఒకరు మాత్రమే రావాలని సూచించారు. చీరాల పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ ని మెయింటినెన్స్ చేయాలని చెప్పారు.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు మాట్లాడుతూ అధైర్యపడవద్దని త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పారు. లాక్డౌన్ కాలంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్లో ఫౌండేషన్ ప్రెసిడెంట్ పంబా నరేష్, నాగేశ్వరరావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.