చీరాల, మార్చి 09 (DN5 News) : ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా అందుతున్న సేవలు బాధ్యతగా, పారదర్శకంగా సమయ స్పూర్తితో పని చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం చీరాల పట్టణంలోని ప్రవేటు కళ్యాణ మండపంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, డిఆర్ఓ గంగధర్ గౌడ్, ఎడి శేషగిరిరావు, ఆర్‌డిఓ చంద్రశేఖర్ నాయుడుతో కలసి రెవిన్యూ సేవలపై తహశీల్దార్లు, సర్వేయర్లు, విఆర్ఓలు, గ్రామ సర్వేయర్లుతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా అందుతున్న సేవలను బాధ్యతగా పారదర్శకంగా సమయ స్పూర్తితో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అనుకుంటున్నానట్లు రెవిన్యూలో పరిపాలన జరుగుతుందాన్న దానిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొట్ట మొదటి సారిగా చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్డిఓ, తహశీల్దార్లు, సర్వేయర్లు, విఆర్ఓలతో రెవెన్యూ సేవలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తహశీల్దార్లు, విఆర్ఓలు, సర్వేయర్లు గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు భూ సంబంధిత సేవలు వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రెవిన్యూ అధికారులు కృషి చేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, పట్టాదారు పాసుబుక్స్, భూమి సర్వేలు, మ్యూటేషన్, వారసత్వ నమోదు వంటి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న భూ సంబంధిత పథకాలు ప్రజలకు సులభంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు, మండల, గ్రామ సర్వేయర్లు, విఆర్ఓలు పాల్గొన్నారు.






