Home విద్య ఫలితాలు – ఆందోళన

ఫలితాలు – ఆందోళన

730
0

అమరావతి : పరీక్షా ఫలితాలు విడుదల అవుతున్నాయంటేనే విద్యార్థుల్లో తల్లి దండ్రుల్లో , ఉపాధ్యాయులలో తీవ్రమైన ఆందోళన మొదలౌతుంది . అది నిజమే ఆయినా ప్రతి సంవత్సరం పరీక్షా ఫలితాల విడుదల తదుపరి జరిగే తీవ్ర పరిణామాలు జ్ఞప్తికి వచ్చి నన్ను ఆందోళనకు గురి చేసాయి. అనుకున్న ఫలితాలు రాలేదని జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్న ఎందరో పసి వాళ్ళు గుర్తుకు రావడంతో, నేడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇవ్వాలని అనిపించింది.

*_విద్యార్థులకు సూచనలు_* : –

👉 10/10 రాలేదని ఆందోళన వద్దు .
👉 అనుకున్నది సాధించ లేకపోయానని బాధపడవద్దు.
👉 అమ్మా నాన్నల ఆశల్ని తీర్చలేకపోయానని వేదన అసలే వద్దు.
👉 తెలివి తేటలకు ఈ పరీక్షా ఫలితాలే కొలమానం కావని తెలుసుకోండి.
👉 ఆత్మహత్యల వంటివి అసలు చేయవద్దు.
👉 పరీక్షా ఫలితాలు జీవితంలో ఒక భాగమే కానీ ఫలితాలే జీవితం కాదు.
👉 అందరి ముందు తలెత్తుకుని ఎలా తిరగాలో అనే అనవసర ఆలోచనలు మానేయండి.
👉 ఇప్పటి ఈ నెగటివ్ ఫలితాలు మిమ్మల్ని మరింత రాటు దేల్చాలి.మున్ముందు ఘన విజయాలకు నాంది కావాలి.
👉 ఇనుమడించిన ఉత్సాహంతో అనుకున్న లక్ష్యాన్ని మళ్ళీ ప్రయత్నించి సాధించాలి.
👉 మీ అమ్మా నాన్నలకు భరోసా నివ్వండి! నమ్మకం కల్గించండి.
👉 అపజయానికి కారణాలను విశ్లేషించండి!
👉 మలి ప్రయత్నంలో మీరు అనుకున్నది సాధించ గలమని ధైర్యం చెప్పండి! అంతేకాని ఆత్మహత్యల వంటి అనర్థాలకు పూనుకోకండి.

*_తల్లి దండ్రులకు సూచనలు_* :
👉 మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా సరే! వారికి మీ అండ అవసరం అని గుర్తించండి.
👉 అనవసరంగా మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం !ఎంత డబ్బు ఖర్చు చేసాం అని నిందించవద్దు
👉 ఫలానా పిల్లల ఫలితాలు చూడండి అంటూ,పోల్చి మీ పిల్లల ఆత్మాభిమానాన్ని చంపేయకండి.
👉 పిండి కొద్ది రొట్టె,చెట్టు కొద్ది గాలి, శ్రమ కొద్దీ ఫలితం అని మరువకండి!
👉 ఈ అపజయం మీ పిల్లలకు చక్కని గుణపాఠం కావాలి కానీ గ్రహపాటు కారాదు ! అంతకంటే వారిని మీకు శాశ్వతంగా దూరం చేయరాదని గ్రహించండి.
👉 పిల్లలకు మీ ప్రేరణ, మీ సహకారం , ఫలితాలు సరిగారానప్పుడే చాలా అవసరం అని తెలుసుకుని అండగా నిలబడండి.
👉 అంతర్మథనం ద్వారా మార్పు వచ్చేలా మాట్లాడండి,తప్పక వారు అనుకున్న లక్ష్యం చేరుకోగలరని ధైర్యం నూరి పోయండి.
👉 అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చైతన్యం కల్గించండి!
👉 ఫలితాలు జీవితాలకు గీటురాళ్ళు కాదనీ, తెలివి తేటలకు కొలమానాలు కాదని,కింద పడినా
రివ్వున పైకి లేవాలనీ, రెట్టించిన ఉత్సాహంతో
అద్భుత ఫలితాలను,మార్కులను గ్రేడులను సాధించవచ్చనీ ప్రేరణ కల్గించాలి.

పాపారావు పసుపులేటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ – ఇండియా.