చీరాల (DN5 News) : చీరాల, ఖమ్మం రోటరీ క్లబ్‌లు ఆధ్వర్యంలో స్థానిక గోలి సదాశివరావు కల్యాణ మండపంలో ‘ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం’ను ఆర్‌డిఒ టి చంద్రశేఖర నాయుడు మంగళవారం ప్రారంభించారు. శిభిరంలో 180 మంది మహిళలు, పురుషులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హైదరాబాద్ ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు పరీక్షలు చేశారు. కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, తిరు మలశెట్టి లక్ష్మీప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, పసుమర్తి రంగారావు, కొంగర రామచంద్రరావు, బి హేమంత్ కుమార్, గుర్రం రాఘవరావు, గుద్దంటి రమేష్, జివై ప్రసాద్, సుభాషిణి, రామారావు, శ్రీరాం రమేష్, డివి సురేష్, మురళీకృష్ణ, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శైలజ, మెమోగ్రాం టెక్నీషిన్ మహేశ్వరి పాల్గొన్నారు.






