Home జాతీయం తెలంగాణ రైతాంగం పోరాట యోధుడు దొడ్డి కోమరయ్యకు ఘన నివాళి

తెలంగాణ రైతాంగం పోరాట యోధుడు దొడ్డి కోమరయ్యకు ఘన నివాళి

693
0

వనపర్తి : తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 73వ వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రజా వాగ్గేయకారుడు రాజా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదట గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్నారు. 1927లో వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందారులు కుటుంబంలో జన్మించాడు. విసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కడవెండి గ్రామంలో ప్రజల పట్ల అతి క్రూరంగా వివరిస్తూ మనుషులను వెట్టిచాకిరి చేయించడం, వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచారు. భూమికోసం – భుక్తి కోసం, వెట్టి చాకిరికి, దోపిడికి వ్యతిరేకంగాదొరతనాన్ని, రాజరికాన్ని ఎదిరించి ఆధిపత్య వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించి మహా పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొరల దురాగతాలపై తిరగబడ్డ వ్యక్తి కొమరం భీమ్ అన్నారు.

దీంతో గ్రామంలో సంఘం ఏర్పడింది. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకు వచ్చారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం సంస్థానంలో ప్రజలకు స్వాతంత్రం లేకపోవడం ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. స్వాతంత్రోద్యమ ఉత్సవాలు జరుగుతుంటే తెలంగాణలో మాత్రం బానిసత్వంతో కూరుకుపోయారు. 1946 జులై 4న విసునూరు నిజాం రజాకార్లు జరిపిన దాడుల్లో తూటాలకు నేలకొరిగిన అరుణతార తెలంగాణ విప్లవ సేనాని దొడ్డి కొమురయ్యని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజానీకం దొడ్డికొమురయ్య, షేక్ బందగి చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి, షేక్ బందగి, మగ్గం మొయినుద్దీన్, తురుమ్ఖాన్, కొమురం భీం స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటం కొనసాగుండాని తెలంగాణ రాష్ట్రం సాధించుకుందన్నారు. న్యాయం పక్షాన ప్రజల కోసం పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి వనపర్తి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పాషా, శివ, వాల్మీకి సేవా సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు గుజ్జుల బిసన్న నాయుడు, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు తగవుల వెంకటస్వామి, యుటిఎఫ్ జిల్లా నాయకులు వెంకటయ్య, వెంకటేష్, తిమ్మప్ప, బక్కన్న, రాంబాబు, కృష్ణయ్య, ఎంఈఎఫ్ నాయకులు నరసింహ, కళాకారుడు నందిమల్ల డప్పు నాగరాజు, మైనార్టీ జిల్లా నాయకులు షాబుద్దీన్, సిపిఎం నాయకులు రమేష్, విద్యార్థి నాయకులు యువరాజు పాల్గొన్నారు.