– రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచు తామన్న డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు
– రెడ్ క్రాస్ సేవలు విస్తృతం చేస్తాము
– విద్య, వైద్యం కు మరింత ప్రాధాన్యత రెడ్ క్రాస్ ఇస్తుంది.
చీరాల : ప్రముఖ వైద్యులు, బిసి నాయకులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు చీరాల బ్రాంచ్ రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా బీసీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో డాక్టర్ హేమ సుబ్బారావుని హైమ హాస్పిటల్ నందు సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ 2009 నుండి రెడ్ క్రాస్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు, మహిళల చైతన్యం కోసం వివిధ రకాల కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ నాలుగోసారి రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగిందన్నారు. రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతంగా చేస్తానని తెలిపారు.
తాడివలస దేవరాజు మాట్లాడుతూ డాక్టర్ సుబ్బారావు సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించి ఉన్నారని అన్నారు. ప్రజలకి అవసరమైనటువంటి వసతులను రెడ్ క్రాస్ ద్వారా సమకూర్చాలని కొరారు. నూతనంగా ఎన్నిక కాబడిన రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరావు, శ్రీను, వెంకటస్వామి, ప్రసన్న, మురళి పాల్గొన్నారు.