చీరాల, మార్చి 09 (DN5 News) : నూతనంగా ఆధునీకరించిన రెడ్‌క్రాస్ కార్యాలయంను కలెక్టర్ డాక్టర్ వి వినోద్‌కుమార్, సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట సోమవారం ప్రారంభించారు. శిధిలావస్థలో ఉన్న రెడ్‌క్రాస్ కార్యాలయంను ఛైర్మన్ బి శశికిరణ్ ఆధ్వర్యంలో నూతన హంగులతో ఆధునీకరించారు. తొలుత జాతీయ జెండా, రెడ్‌క్రాస్ జెండాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయం ప్రారంభించారు. రెడ్‌క్రాస్ కార్యవర్గ శిలాఫలకం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ చంద్రశేఖర్, తహశీల్దారు గోపికృష్ణ, మున్సిపల్ కమిషనర్, రెడ్‌క్రాస్ వైస్‌ఛైర్మన్ డాక్టర్ ఐ బాబురావు, కార్యదర్శి జిఎవి ప్రసాద్, డాక్టర్ కుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.







