Home ప్రకాశం సిపిఎస్‌ రద్దు కోరుతూ 28న‌ ఛలో విజయవాడ

సిపిఎస్‌ రద్దు కోరుతూ 28న‌ ఛలో విజయవాడ

365
0

చీరాల : పెన్షన్ సాధనసమితి ఆధ్వర్యంలో సిపిఎస్‌ రద్దు కోరుతూ ఈనెల 28న ఛ‌లో విజయవాడ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టిన‌ట్లు యుటిఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి గౌరాబ‌త్తిన సూరిబాబు తెలిపారు. విజ‌య‌వాడ‌లో చేప‌ట్టిన నిరాహార దీక్ష‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మిక, పెన్షనర్లు వేలాదిగా పాల్గొనాల‌ని కోరారు.

యుటిఎఫ్ కార్యాల‌యంలో సోమ‌వారం జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్ కె వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్‌ రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. తమకు అధికారం ఇస్తే సిపిఎస్‌ రద్దు చేసి తీరతామని ప్రతిపక్ష వైసిపి హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు. అధికారంలో ఉన్న టిడిపి మాత్రం కనీస స్పందన లేకుండా వ్యవహరించడాన్ని యుటిఎఫ్ పట్టణశాఖ ప్రధానకార్యదర్శి షేక్ జానీబాష పేర్కొన్నారు. యుటిఎఫ్ సీనియర్ నాయకులు గవిని నాగేశ్వర రావు మాట్లాడుతూ ఇప్పటికైనా సిపిఎస్‌ రద్దు చేయాలని, లేకుంటే భవిష్యత్‌లో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఛలో విజయవాడను జయప్రదం చేయాల‌ని యుటిఎఫ్‌ పట్టణ అధ్యక్షులు పాలేటి సురేష్, సహాధ్యక్షులు బిరుదు పిచ్చయ్య, గౌరవాధ్యక్షులు కె సుబ్బారావు, కోశాధికారి ఎస్‌వి సుబ్బారెడ్డి, కుటుంబ సంక్షేమ పథక జిల్లా సహాయకార్యదర్శి కుర్రా శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్ కమీటీ సభ్యులు ఎస్ఎండి ఖాసీం, జెవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, యుటిఎఫ్‌ చీరాల మండల అధ్యక్ష ప్రధాన కార్యాదర్శులు బొడ్డు బాలచంద్రరావు, సయ్యద్ సుభాని, వేటపాలెం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, సాంబశివ‌రావు, రాజేష్, శ్రీను కోరారు.