రేషన్ డెలివరీ మినీ వ్యాన్లను ప్రారంభించిన మంత్రి బాలినేని

    255
    0

    ఒంగోలు : పట్టణంలోని మినీ స్టేడియం ఆవరణలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనాల జిల్లా ఇన్చార్జి మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు ఎల్ల వద్దకే చేర్చేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు అన్నారు. రేషన్ సరుకులను లబ్ధిదారులు అందరికీ ఇళ్ల వద్దకే చేర్చేందుకు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే నెల నుండి రేషన్ సరుకులు ప్రతి ఇంటికి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్, వైస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గోలి కుమారి ఆనందరావు పాల్గొన్నారు.