Home ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని మంత్రికి వినతి

రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని మంత్రికి వినతి

391
0

చిలకలూరిపేట : రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతోపాటు 11రకాల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రేషన్ డీలర్ల జెఏసి ఆధ్వర్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అందజేశారు. చిలకలూరిపేటలో ఆయనను కలసి డీలర్ల సమస్యలు వివరించారు. అనంతరం పౌరసరఫరాల శాఖ కమిషనర్ను కలసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలసినవారిలో డీలర్ల జేఏసీ నాయకులు బుగతా వెంకటేశ్వరరావు, అడప రమణ, వెంకటరావు, మధు, శేషు, గంగాధర్, పల్లయ్య, కొండబాబు, రామారావు, అంజినేయులు, సుమన్, రమేష్ ఉన్నారు.