చీరాల : మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ చీరాల ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 24 ఎంపీటీసీ ప్రాదేశికాలకు వైయస్సార్ సిపి బి ఫారాలను పంపిణీ చేశారు. బీ ఫారాలు పొందిన ఎంపిటిసి అభ్యర్థులు వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బి ఫారం సమర్పణ గడువు ముగిసిన అనంతరం కొంత మంది అభ్యర్థులు తమ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆమంచి ఆధ్వర్యంలో రామకృష్ణాపురం ఒకటి నుండి జంగిలి రాజేశ్వరి, రామకృష్ణపురం 2 నుండి గోలి శివ నాగరాజు ఎంపీటీసీలుగా ఏకగ్రీవం అయ్యారు.