Home ప్రకాశం ఆమంచి ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావ యాత్ర

ఆమంచి ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావ యాత్ర

372
0

చీరాల : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి సంఘీభావంగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేతృత్వంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో ని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా మానవహారం నిర్మించారు. అమరావతిలో ఎలాంటి ప్రమాణాలు చేయకుండానే కంప్యూటర్లో గ్రాఫిక్స్ చూపించి తన సామాజికవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం, పాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదని అన్నారు. వరద ముంపు ప్రాంతంలో రాజధాని తీసుకొచ్చి ఆహారధాన్యాలు పండే పంట భూములను నాశనం చేశారని ఆరోపించారు.

అమరావతి ప్రాంతం మొత్తం కొండవీడు నదీ పరివాహక ప్రాంతం అని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతం కాకుంటే మురుగు నీటి ఎత్తిపోతల పథకం ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. మురుగు నీటి ఎత్తిపోతల పథకం దేశంలో ఎక్కడా లేదని అలాంటి పథకాన్ని చంద్రబాబు నిర్మాణం చేయడం ఏమిటన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం రమేష్ బాబు, వైసిపి నాయకులు జి సత్యనారాయణ, మార్పు గ్రెగరీ, మాజీ డి ఆర్ యు సి సభ్యులు ఎడం రవిశంకర్, మాజీ ఎంపీటీసీ దారుణ శాస్త్రి, సేలం శ్యాంబాబు, తంగా శ్రీధర్, వాసుమల్ల వాసు, బాబు పాల్గొన్నారు.