రకుల్ ప్రీత్ సింగ్… తెలుగు ఫిల్మ్ మేకర్స్ కోరుకునే నిఖార్సైన ముంబై బ్యూటీ! అందుకే ఓ దశలో తన అందచందాలతో టాలీవుడ్ ను ఆగం చేసింది. టాప్ స్టార్స్ తో వరుస హిట్స్ కొట్టింది. అయితే, అంతలోనే అనూహ్యంగా తెలుగు తెరపై క్రమక్రమంగా కనుమరుగవుతూ వచ్చింది!
నాగార్జునతో ‘మన్మథుడు 2’లో రొమాన్స్ చేసింది రకుల్. అయితే, ఆ తరువాత పెద్దగా అలికిడి లేదు. నితిన్, చంద్రశేఖర్ యేలేటి సినిమా తప్ప ఈమె చేతిలో ప్రస్తుతం తెలుగు ఆఫర్స్ ఏం లేవు. అలాగని హిందీలో బిజీగా ఉందా అంటే… అక్కడ కూడా మరీ చేతి నిండా పని లేదు. ఒకట్రెండు సినిమాలతో కాలం వెళ్లదీస్తోంది. అయితే, రకుల్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా తెలుగు దర్శకనిర్మాతలు మాత్రం ఆమె పేరు తమ సినిమాల కోసం పరిశీలించటం లేదు!
హీరోలు కూడా రకుల్ ని మరిచిపోయినట్టే కనిపిస్తోంది!
ఈ మధ్య కాలంలో క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా కోసం, బోయపాటి, బాలయ్య చిత్రం కోసం… ఇలా అనేక ప్రాజెక్ట్స్ కోసం హీరోయిన్స్ అన్వేషణ కొనసాగింది. ఆ సమయంలో పూజా హెగ్డే మొదలు కియారా అద్వాణీ దాకా చాలా మంది పేర్లు వినిపించాయి. రకుల్ ప్రీత్ మాత్రం చర్చలో లేకుండా పోయింది. ఇలా ఎందుకైందని ఆరా తీస్తే… కొందరు ఫిల్మ్ నగర్ జనం ఆమె ముంబైలో మకాం వేసిందంటున్నారు. హిందీ సినిమాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ టాలీవుడ్ వైపు చూడటం లేదట. ఇక మరికొందరి వాదన ప్రకారం, రకుల్ కంటే యంగ్ బ్యూటీస్, ఫుల్ టైం టాలీవుడ్ పై దృష్టి పెట్టి కష్టపడుతున్న వారు ఫీల్డ్ లో ఉండగా… ఈ 30 ఇయర్స్ బ్యూటీ పై సహజంగానే మోజు తగ్గిందట! చూడాలి మరి, టాలీవుడ్ లో తగ్గిన క్రేజ్, మన పంజాబీ పాపకి, బాలీవుడ్ లోనైనా దక్కుతుందేమో!